శాయంపేటలో కలుషిత మంచినీటి సరఫరాపై ప్రజల ఆందోళనఅధికారులు వెంటనే స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి

శాయంపేట, మే 31:హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో మంచినీటి సరఫరాపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి సరఫరా అవుతున్న తాగునీటిలో బురద, మురికి నీరు వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రతిరోజూ నీటి సరఫరా సమయంలో స్వచ్ఛమైన తాగునీటికి బదులుగా మురికి నీరు వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం ప్రభుత్వంపై ఆధారపడుతున్న కుటుంబాలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే భయాందోళనకు గురవుతున్నాయి. కలుషిత నీరు తాగడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాటర్ ట్యాంక్ నిర్వహణ, పైపులైన్ల పరిస్థితి, నీటి శుద్ధి ప్రక్రియపై సంబంధిత అధికారులు వెంటనే పరిశీలన చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛమైన తాగునీరు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మండల ప్రజాప్రతినిధులు, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి మురికి నీటి సమస్యను పరిష్కరించి, శాయంపేట ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post