ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలిరైతులకు వ్యవసాయ శాఖ సూచన

శాయంపేట, మే 25: శాయంపేట మండలంలోని రైతులందరూ తప్పనిసరిగా Farmer Registryలో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు) లేదా సమీప మీ సేవా కేంద్రాలను సంప్రదించి నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.
Farmer Registry ద్వారా రైతుల వివరాలు డిజిటల్ రూపంలో నమోదు చేయబడతాయని, దీని వలన PM-KISAN, యూరియా బుకింగ్‌తో పాటు ఇతర సబ్సిడీ సంబంధిత సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఇక గత సీజన్‌లో యూరియా బుకింగ్ సమయంలో మొబైల్ నంబర్ సమస్యలు ఎదుర్కొన్న రైతులు వెంటనే తమ సంబంధిత AEOలను సంప్రదించి మొబైల్ నంబర్ నవీకరణ చేయించుకోవాలని సూచించారు. తద్వారా భవిష్యత్తులో యూరియా బుకింగ్ యాప్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలను పొందవచ్చని తెలిపారు.
కావున రైతులందరూ వీలైనంత త్వరగా Farmer Registryలో నమోదు చేసుకుని ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post