ఆయిల్ ఫామ్ తోటలో కార్మికుడు అనుమానాస్పద మృతిన్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన

హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ఓ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన కుక్కల సారయ్య మాందారిపేట గ్రామానికి చెందిన మల్లారెడ్డి ఆయిల్ ఫామ్ తోటలో గత రెండేళ్లుగా పనిచేస్తున్నాడు.
శనివారం సాయంత్రం ఆయిల్ ఫామ్ తోటలో సారయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండగా స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల సివిల్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ సరైన దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post