అర్బన్ చాలెంజ్ ఫండ్‌లో వరంగల్‌కు రూ.4,674 కోట్లుకేంద్రం ఆమోదంతో నగరాభివృద్ధికి భారీ ఊతం : ఎంపీ డాక్టర్ కడియం కావ్య

హనుమకొండ, మే 22
 : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ చాలెంజ్ ఫండ్‌ (UCF) కింద వరంగల్ నగరానికి రూ.4,674 కోట్ల భారీ నిధులు మంజూరైనట్లు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు. తెలంగాణకు ఆమోదమైన మూడు ప్రధాన ప్రాజెక్టులకు మొత్తం రూ.5,681 కోట్లు కేటాయించగా, అందులో అత్యధిక భాగం వరంగల్‌కే దక్కడం రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

ఈ నిధులతో వరంగల్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, వరద నివారణ పనులు, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టనున్నట్లు ఎంపీ వెల్లడించారు. ప్రాజెక్టులు పూర్తయితే వరంగల్ నగర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, ప్రజలకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వద్ద సమర్థవంతంగా ప్రతిపాదనలు ఉంచడం వల్లే ఈ నిధులు సాధ్యమయ్యాయని ఎంపీ తెలిపారు. పట్టణాభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి ఫలితంగానే వరంగల్‌కు ఈ స్థాయి నిధులు లభించాయని పేర్కొన్నారు.

ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 50 శాతం నిధులు సమకూర్చనున్నాయని, మిగతా భాగాన్ని హడ్కో రుణాల ద్వారా సమీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పనులు పూర్తయిన అనంతరం వరంగల్ ఆధునిక నగరంగా రూపుదిద్దుకోనుందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post