శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో గ్రామ భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సోలార్ సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమానికి గ్రామ ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చారు. తేదీ 15.05.2026న గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శులు గ్రామ కమిటీతో కలిసి తీర్మానం చేసి నాలుగు సోలార్ సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.25,000లను సమకూర్చారు.
ఈ మొత్తాన్ని శాయంపేట సీఐ, ఎస్సైల సమక్షంలో సీసీ కెమెరాల టెక్నీషియన్ అనిల్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ “ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం” అని పేర్కొన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణ, అనుమానాస్పద కదలికల గుర్తింపు మరియు ప్రజల భద్రతకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ప్రతి గ్రామంలోని గ్రామ పెద్దలు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమానికి సహకరించాలని, నేరాల నియంత్రణలో పోలీసులకు భాగస్వాములు కావాలని సీఐ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.
Post a Comment