నూతన సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన శాయంపేట వర్కింగ్ జర్నలిస్టులు

శాయంపేట మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ వై. సుధాకర్ రెడ్డిని శాయంపేట వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు సీఐకి శుభాకాంక్షలు తెలియజేసి, శాయంపేట మండలంలోని ప్రజా సమస్యలు, శాంతిభద్రతల పరిరక్షణలో మీడియా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
సీఐ వై. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని, శాంతిభద్రతల పరిరక్షణలో మీడియా పాత్ర ఎంతో కీలకమని అన్నారు. పోలీస్ శాఖకు జర్నలిస్టులు అందించే సమాచార సహకారం సమాజానికి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో శాయంపేటకు చెందిన పలువురు వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొని నూతన సీఐకి శాలువాతో అందజేసి అభినందనలు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post