నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి

హనుమకొండ నగరంలోని బొక్కలగడ్డలో ఈరోజు ఉదయం చైన్‌ స్నాచింగ్‌ కలకలం సృష్టించింది. సిటిజన్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి, వృద్దురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయిన సంఘటన సంబంధించి సిసి కెమెరాల ఆధారం గుర్తించిన చైన్ స్నాచింగ్ పాల్పడిన నిందితుడి చిత్రాన్ని హన్మకొండ పోలీసులు విడుదల చేశారు. గ్రీన్ కలర్ టీ షర్ట్, నల్ల ప్యాంట్, క్యాప్ ధరించిన నిందితుడిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హన్మకొండ ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్ తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post