మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన వ్యక్తి కుల బహిష్కరణతో మనస్థాపానికి గురై గడ్డి మందు తాగిన ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన బాబు ఐలన్న (యాదవ) తన పెద్ద కుమారుడు వేరే కులానికి చెందిన యువతిని వివాహం చేసుకున్న నేపథ్యంలో, గ్రామంలోని కుల పెద్దలు అతనిపై కుల బహిష్కరణ విధించినట్లు సమాచారం. ఈ పరిణామంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఐలన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఐలన్నకు ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ సేవల్లో EMT అనిల్, పైలెట్ కేదారి పాల్గొన్నారు.
ఐలన్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉందని తెలిసింది.
Post a Comment