శాయంపేట, మే 4: మండల కేంద్రంలోని అతి పురాతన శ్రీ మత్స్యగిరి స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి వైభవంగా ముగిశాయి. ఆలయంలో స్వామివారి నాగవల్లి కార్యక్రమాన్ని అర్చకులు కృష్ణమాచార్యులు ఘనంగా నిర్వహించారు.
గత నెల 29వ తేదీ నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగాయి. మచ్చర్లయ్య గుట్టకు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా విశ్వక్సేనారాధన, స్వస్తి పుణ్యాహవచనం, ద్వాదశ ఆరాధనలు, పుష్పయాగం వంటి పూజా కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అలాగే శ్రీ మత్స్యగిరి స్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో అలంకరించి ఆలయం చుట్టూ ఘనంగా ఊరేగించారు. ఈ ఊరేగింపును దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అనంతరం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి పండితులను సన్మానించి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసినట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతల ఉమా రవిపాల్, జిన్నా ప్రతాప్ సేనారెడ్డి, కుసుమ వెంకటకృష్ణ, సామల రవీందర్ తదితరులు పాల్గొనగా, భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Post a Comment