శాయంపేట, మే 4: ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరి, అస్సాం రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా బిజెపి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ నేపథ్యంలో శాయంపేట మండల కేంద్రం మరియు మైలారం గ్రామంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా విజయ సంబరాలు నిర్వహించారు.
బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ, దేశ ప్రజలు మరోసారి ప్రతిపక్షాల అబద్ధ రాజకీయాలను తిరస్కరించి అభివృద్ధి, జాతీయత, పారదర్శక పాలనకు మద్దతు పలికారని అన్నారు. ఈ ఫలితాలు బిజెపి సిద్ధాంతాల విజయానికి నిదర్శనమని, ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను మోసం చేసే రోజులు ముగిశాయని, దేశం మొత్తం బిజెపి వైపు కదులుతోందని అన్నారు. ప్రధాన మంత్రి నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ఈ విజయాలు ఆ ప్రయాణంలో మరో కీలక అడుగని తెలిపారు. భవిష్యత్తులో కూడా బిజెపి మరింత బలంగా ఎదిగి ప్రతి రాష్ట్రంలో జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు కానుగుల నాగరాజు, సీనియర్ నాయకులు వనం దేవరాజు, బూర ఈశ్వరయ్య, ఉప్పు రాజు, బాసాని విద్యాసాగర్, మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, మండల ఉపాధ్యక్షులు కోమటి రాజశేఖర్, పోల్ మహేందర్, మండల కార్యదర్శి మేకల సుమన్, మండల కోశాధికారి కుక్కల మహేష్, భూత్ అధ్యక్షులు కోడిపాక సంజీవరావు, కడారి చంద్రమౌళి, బాసాని నవీన్, కన్నెబోయిన రమేష్, పైడిమల్ల సుధాకర్, చెక్క దినేష్, బత్తుల రవి, ఎర్ర రాకేష్, పసునూటి తిరుపతి, బత్తుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment