ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై మాట్లాడిన సీఎం, ప్రాణాలు తీసుకోవడం ద్వారా సమస్యలకు పరిష్కారం లభించదని స్పష్టం చేశారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఈ విషయంపై ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలిపారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించాలని సంబంధిత మంత్రులకు సీఎం సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు కార్మిక సంఘాలతో చర్చలు జరపనున్నారు.
కార్మికుల సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు.
Post a Comment