మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే… పెద్దకొడేపాక గ్రామానికి చెందిన బోళ్ల మల్లేష్ అనే వ్యక్తి, ఓ మహిళకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన బైక్‌పై ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, బైక్‌ను వేగంగా నడిపించాడు.
ఈ క్రమంలో మహిళ బైక్‌పై నుంచి కిందపడిపోవడంతో చేతికి, తలకు గాయాలు అయ్యాయి. బాధిత మహిళ శాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై జె. పరమేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది.
Post a Comment