పరకాల & మరి కొన్ని సంఘాలలో మాజీ మాజీ చైర్మన్& మాజీ మాజీ పాలకవర్గం పై చేయి .చేనేత సహకార సంఘాల ఓటరు జాబితాపై వివాదంఅధికారుల నిర్లక్ష్యం, గోప్యతపై ఆరోపణలు

పరకాల, ఏప్రిల్ 24: హన్మకొండ జిల్లా పరకాల&మరి కొన్ని సంఘాలలో మాజీ మాజీ చైర్మన్& మాజీ మాజీ పాలకవర్గం పై చేయి
 ప్రాంతంలో చేనేత సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా తయారీపై వివాదం నెలకొంది. జౌళి శాఖ అధికారులపై స్థానిక చేనేత కార్మికులు మరియు సంఘ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
నియమాల ప్రకారం ఏప్రిల్ 18 నుంచి 25 వరకు ఓటరు జాబితాను చేనేత సహకార సంఘాలు మరియు గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులపై ప్రదర్శించాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు పబ్లిక్‌కు అందుబాటులో ఉంచలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ సరైన స్పందన లభించలేదని తెలిపారు.
ప్రస్తుత సంఘాల అధ్యక్షులు పదవుల్లో కొనసాగేందుకు అనుకూలంగా ఓటరు జాబితా రూపొందిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సభ్యత్వం కలిగిన సుమారు 150 మందిలో వాటాదారుల వివరాలను మార్చి, కొంతమందిని ఓటు హక్కు నుంచి దూరం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, మరణించిన వారి స్థానాల్లో ఇతరులను చేర్చడం, కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
చేనేత కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, నాబార్డ్ ఆధ్వర్యంలో అమలు అవుతున్న పథకాల నిధుల వినియోగంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పాలకవర్గం వస్తే ఈ అంశాలు వెలుగులోకి వస్తాయని భయంతో ప్రస్తుత నిర్వాహకులు మరియు కొంతమంది అధికారులు కలిసి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు జౌళి శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఓటరు జాబితాలో ఉన్న అక్రమాలను సరిచేసి, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిందిగా పరకాల మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు దాసరి బిక్షపతి డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కూడా కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post