శాయంపేట గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామపంచాయతీ మరో ముందడుగు వేసింది. గ్రామపంచాయతీ సర్పంచ్ చింతల ఉమా-రవిపాల్ మణమణ ఆధ్వర్యంలో చిన్నబడి వద్ద ఉన్న తాగునీటి ట్యాంక్‌ను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు.
గ్రామంలోని చిన్నారులు మరియు ప్రజలు ఉపయోగించే. ఈ చర్యతో గ్రామంలో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో పాటు ఆరోగ్య సమస్యలు నివారించవచ్చని సర్పంచ్ తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. గ్రామంలో పరిశుభ్రత మరియు ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment