ఊరుగొండలో బాలిక అదృశ్యం… పోలీసుల దర్యాప్తు ప్రారంభం

దామెర, ఏప్రిల్ 25:
హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక చాపర్తి సాత్విక అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.
బాలిక తండ్రి సతీష్, తల్లి చాపర్తి కోమలల కుమార్తె అయిన సాత్విక, శనివారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఇంటి వద్ద నుండి కనిపించకుండా పోయింది. ఈ విషయమై బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దామెర ఎస్సై కొంక అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బాలిక ఎత్తు సుమారు 4 అడుగుల 2 అంగుళాలు ఉండి, చామన చాయ రంగు, గుండ్రటి ముఖం కలిగి ఉంటుంది. అదృశ్యమైన సమయంలో ఆరెంజ్ రంగు పంజాబీ డ్రెస్, తెలుపు రంగు స్కార్ఫ్ ధరించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బాలిక ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోన్ నంబర్లు: 8712685228 (SI దామెర), 8712685020 (పోలీస్ స్టేషన్ దామెర).
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post