నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఘటన జరిగిన తీరును సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, కేసు వివరాలు, పరిస్థితులు, తదుపరి చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్శనలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు, నర్సంపేట ఏసీపీలు జితేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఇన్స్‌పెక్టర్ ముస్క శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, సాయి రమణ, దుగ్గొండి ఎస్‌ఐ రణధీర్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసులు ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Post a Comment