శాయంపేట, ఏప్రిల్ 18:
శాయంపేట మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే విద్యాసంస్థ (MJPTBWS), కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ముందుగా ఎంజేపీ పాఠశాలను సందర్శించిన తహసీల్దార్, విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న భోజనం నాణ్యత, మెనూ అమలు పరిస్థితులను తెలుసుకున్నారు. వంటగదిని పరిశీలించి, హాస్టల్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు సేకరించారు.
అనంతరం కేజీబీవీ బాలికల పాఠశాలను పరిశీలించిన ఆయన, పరిసరాల పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలను తనిఖీ చేశారు. విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలపై ఆరా తీశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో ఎంజేపీ ప్రిన్సిపాల్ రేవతి, కేజీబీవీ ప్రిన్సిపాల్ మాధవితో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment