నల్లబెల్లి, ఏప్రిల్ 18:
జనగణన-2027 కార్యక్రమం భాగంగా నల్లబెల్లి మండలంలో హౌస్ లిస్టింగ్ ప్రక్రియకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. మండలంలోని ప్రతి ఇంటిని గణన చేయడానికి మే 11 నుండి జూన్ 9 వరకు హౌస్ లిస్టింగ్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమం కోసం మండలంలో మొత్తం 85 హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లు ఏర్పాటు చేయగా, 60 మంది ఎన్యూమరేటర్లు, 10 మంది సూపర్వైజర్లను నియమించారు. ఈ మేరకు వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
హౌస్ లిస్టింగ్ నిర్వహణలో భాగంగా మొదటి విడత శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 18, 19, 20 తేదీలలో నల్లబెల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా 33 మంది ఎన్యూమరేటర్లు, 6 మంది సూపర్వైజర్లకు గణన విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఫీఓ పి. రవి, మండల ప్లానింగ్ & స్టాటిస్టికల్ ఆఫీసర్ అనిల్ కుమార్, జెడ్పీహెచ్ఎస్ హెడ్‌మాస్టర్ వసంతతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అధికారులు తెలిపిన ప్రకారం, హౌస్ లిస్టింగ్ ప్రక్రియను ఖచ్చితంగా, సమగ్రంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
Post a Comment