ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తున్న కేంద్రం: ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు

శాయంపేట, ఏప్రిల్ 18:
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ గ్రామీణ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తోందని భారత జాతీయ కాంగ్రెస్ కార్మిక సంఘం (ఐఎన్టీయూసీ) శాయంపేట మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ విమర్శించారు.
శనివారం ఆయన మాట్లాడుతూ, గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తూ జీవనాధారంగా నిలుస్తున్న ఈ చట్టాన్ని బలహీనపరిచే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న కేవైసీ విధానం కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పని ప్రదేశాల్లో నెట్‌వర్క్ సౌకర్యం సరిగా లేకపోవడంతో ఫోటోలు అప్లోడ్ చేయలేకపోతున్నారని, దీనివల్ల కూలీలు తమ పనిదిన వేతనాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఫోటో నమోదు కాకపోతే ఆ రోజు కూలి దక్కని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో వెంటనే ఫోటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలని, కార్మికులకు ఇబ్బందులు కలిగిస్తున్న నిబంధనలను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రం తీసుకొచ్చిన కొత్త విధానాలను పునర్విమర్శించాలని కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post