శాయంపేట మండలంలోని హుస్సేన్‌పల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఏపీవో కె. అనిత శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున కార్మికులు ఉదయం వేళల్లోనే పనులకు హాజరై త్వరగా పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రతి కార్మికుడి హాజరు నమోదు తప్పనిసరి కాబట్టి ఉదయం 6 గంటలకే పనిస్థలానికి వచ్చి హాజరు నమోదు చేసుకోవాలని తెలిపారు.
గత రెండు మూడు నెలలుగా చేసిన పనులకు వేతనాలు జమ కాలేదని కార్మికులు ప్రశ్నించగా, వారం నుంచి పది రోజులలోపు వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ఆమె హామీ ఇచ్చారు.
అదేవిధంగా ఎండల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
Post a Comment