Arrive Alive” కార్యక్రమం.. హనుమకొండలో రోడ్డు భద్రతపై అవగాహన

హనుమకొండ, ఏప్రిల్ 18:
“Arrive Alive” కార్యక్రమం భాగంగా హనుమకొండ పరిధిలోని వరంగల్ పబ్లిక్ స్కూల్, అదాలత్ జంక్షన్ ప్రాంతాల్లో శనివారం విస్తృత స్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హనుమకొండ ఏసీపీ  హాజరై, సుబేదారి ఇన్స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ తమ సిబ్బందితో కలిసి ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాహనదారులకు గులాబీలు పంపిణీ చేస్తూ రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించారు.
బైక్, కారు వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ప్రాణరక్షకమని తెలియజేసి, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై చైతన్యం కల్పించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
అదేవిధంగా పాఠశాల బస్సులు, డ్రైవర్లను తనిఖీ చేసి విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.
“Arrive Alive” లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post