ములుగు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి దిష్టిబొమ్మ దహనం

ములుగు, ఏప్రిల్ 18:
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు.
భాజపా మండల అధ్యక్షుడు మార్క సతీష్ నాయకత్వంలో జాతీయ రహదారి 163పై ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈ చర్య చేపట్టినట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నారీ శక్తి వందన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టగా, ప్రతిపక్షాలు దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించాయని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రతిపక్షాల వైఖరిని మహిళలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు టి. దేవేందర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి వెంకట్, జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కొత్త సుధాకర్ రెడ్డి, నిడుమోలు శ్రీనివాస్, మేరుగు సత్యనారాయణ, కర్ర సాంబశివ రెడ్డి, గాందర్ల నరేష్, ఏదునూరి రమేష్, వంగాల సోమ్మిరెడ్డి, వలుపదాసు రవిశంకర్, బొల్లంపల్లి మురళి, మార్త రమేష్, అమ్మ లింగయ్య, బండి మోహన్, నిడుమోలు సాంబయ్య, బండి వేణు, జవహర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post