వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
ములుగు జిల్లా రాఘవపట్నం గ్రామంలో రైతులతో మాట్లాడిన ఆయన, ఇటీవల కురిసిన వడగండ్ల వానల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈనెల 20, 21 తేదీల్లో ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, నష్టాలను అంచనా వేసి సరైన పరిహారం అందించాలని కోరారు.
Post a Comment