మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ నిరసన.. కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర విమర్శలు

పరకాల, ఏప్రిల్ 18:
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పరకాల బస్టాండ్ సర్కిల్ వద్ద శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు పరకాల పట్టణ, రూరల్ మండల అధ్యక్షులు గాజులు నిరంజన్, కాసగాని రాజ్ కుమార్ నాయకత్వంలో ఈ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకుడు డా. పెసరు విజయచందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. మహిళా సాధికారతపై బయట గొప్పలు చెప్పే కాంగ్రెస్, పార్లమెంట్‌లో మాత్రం వ్యతిరేక వైఖరి ప్రదర్శించిందని ఆరోపించారు.
దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు న్యాయం చేయాల్సిన సమయంలో రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు బిల్లును అడ్డుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ అడ్డుకుంది బిల్లును కాదు.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని” అంటూ విమర్శించారు. మహిళా హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ విఫలమైందని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్, మున్సిపల్ కౌన్సిలర్లు బేజ్జంకి పూర్ణాచారి, కుక్కల విజయకుమార్, పార్టీ నాయకులు పాలకుర్తి తిరుపతి, గుండెబోయిన నర్సయ్య, జంగిలి రాజేందర్ రావు, మెంతుల స్వప్న సురేష్, కాచం గురుప్రసాద్, సిరంగి సతీష్ కుమార్, దంచనాదుల సత్యనారాయణ, మరేడుగొండ భాస్కరాచారి, ముత్యాల దేవేందర్, దుబాసి కృష్ణ ప్రసాద్, కాగితపు చంద్రమోహన్, కక్కు రాజు, రాజేంద్ర ప్రసాద్, నరసింహ, ఎదునూరి లింగయ్య, సీనియర్ నాయకులు మాచబోయిన బాబు యాదవ్, ఏకు సదయ్య తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post