ఇబ్రహింపట్నం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రూపంలో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న సాంకేతిక మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని రాష్ట్ర ముఖ్యమంత్రి A. Revanth Reddy హెచ్చరించారు. ఏఐ వల్ల ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశముందని, దీనికి ప్రత్యామ్నాయంగా బ్లూ కాలర్ ఉద్యోగాలకు అనుగుణంగా సమాజం, విద్యా వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఇబ్రహింపట్నంలో విద్యావేత్త, ఎమ్మెల్సీ AVN Reddy స్థాపించిన AVN Lakefield Global Schoolను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, దేశం ఎదుర్కోబోయే ఏఐ సునామీ తీవ్రతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే భవిష్యత్తును రక్షించే మార్గమని పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో విద్య అందుబాటులో ఉన్నప్పటికీ, నాణ్యత విషయంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. “ఎక్కడ తప్పు జరిగిందో ప్రజాప్రతినిధులంతా ఆలోచించాలి. పరిస్థితులకు అనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.
విద్యారంగంలో సంస్కరణల దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వంద నియోజకవర్గాల్లో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మాణాన్ని ప్రారంభించామని తెలిపారు. ఒక్కో పాఠశాలలో 2,500 మంది విద్యార్థులు చదువుకునేలా ప్రణాళిక రూపొందించామని, ఇప్పటివరకు 59 పాఠశాలల పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు.
విద్యా నాణ్యత పడిపోతున్న దుస్థితిని సీఎం వివరించారు. మూడో తరగతి విద్యార్థి ఒకటో తరగతి పుస్తకాన్ని కూడా చదవలేని పరిస్థితి, ఆరవ తరగతి విద్యార్థి మూడో తరగతి పాఠ్యాంశాలను అర్థం చేసుకోలేకపోతున్నాడని తెలిపారు. ఇది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని హెచ్చరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు రావడం లేదని చెప్పారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, 11 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు. ప్రభుత్వ విద్యాపై నమ్మకం తగ్గడంతోనే ప్రైవేట్ వైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా 100 ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించే విధానాన్ని ప్రవేశపెడుతున్నామని సీఎం తెలిపారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలో పాఠశాలల రేషనలైజేషన్ చేసి మోడల్ స్కూళ్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ప్రైవేట్ పాఠశాలల విజయంలో నర్సరీ, ఎల్‌కేజీ విధానం, రవాణా సౌకర్యం కీలకమని గుర్తించిన ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని నిర్ణయించిందన్నారు. అదనంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ రూపంలో పోషకాహారం అందించనున్నట్లు తెలిపారు.
విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తామని, క్రీడల్లో రాణించిన వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం పేర్కొన్నారు. 2034లో భారత్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ Gutta Sukender Reddy, కేంద్ర మంత్రి G. Kishan Reddy, ఎంపీలు D. K. Aruna, Vem Narender Reddy, Raghunandan Rao, Chamala Kiran Reddy తదితరులు పాల్గొన్నారు.
Post a Comment