వరంగల్: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలో వరంగల్‌కు రానున్నారనే వార్తల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు.
ప్రధాని మోదీ మామునూరు ఎయిర్‌పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు భద్రకాళి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG), ఆక్టోపస్ బలగాలు ఆలయ పరిసరాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించాయి.
గతంలో మోదీ దర్శనాల సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి కూడా భద్రకాళి కారిడార్ అభివృద్ధిపై స్థానికుల్లో ఆశలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, ప్రధాని రాకపై బీజేపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Post a Comment