రేపటి సమ్మె కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీరాష్ట్రవ్యాప్తంగా డిపోల ఎదుట మహాధర్నాలకు పిలుపు

హైదరాబాద్, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న సమ్మెకు భాగంగా రేపటి కార్యాచరణను ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఉదయం 5 గంటల నుంచి మహాధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.
సమ్మె మొదటి రోజు విజయవంతం చేసిన కార్మికులకు జేఏసీ నాయకత్వం ధన్యవాదాలు తెలిపింది. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా తమ చేతుల్లో పరిష్కారం లేదని చెప్పిందని జేఏసీ ఆరోపించింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది.
ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 వేతన సవరణను కనీసం 30 శాతం తగ్గకుండా అమలు చేయాలని, హైదరాబాద్‌లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలని కోరింది. అదేవిధంగా ఉద్యోగులను ఇతర జోన్లకు బదిలీ చేసే ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కార్మిక సంఘాలను పునరుద్ధరించి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది.
కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని, వెనక్కి తగ్గబోమని ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం పై హెచ్చరిక జారీ చేసింది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post