హనుమకొండ: మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు విస్తృతంగా గస్తీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీఐ బొల్లం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
మిల్స్ కాలనీ ఎస్‌హెచ్‌ఓ బొల్లం రమేష్, ఎస్‌ఐ శ్రవణ్‌తో పాటు పోలీస్ సిబ్బంది, క్యూఆర్‌టీ బృందం కలిసి సకారాశికుంట, కీర్తి బార్ పరిసరాలు, కరీమాబాద్ ఉరుస్ దర్గా ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్ చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐ బొల్లం రమేష్ మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీ మరింత కట్టుదిట్టం చేస్తామని తెలిపారు.
ప్రజలు పోలీసులతో సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.
Post a Comment