శాయంపేట మండలంలోని మాందారిపేట స్టేజి సమీపంలో శనివారం బస్సు–లారీ ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు కుడి కాలు విరిగినట్లు సమాచారం. అదేవిధంగా మరో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఈ రక్షణ చర్యల్లో ఈఎంటి అనిల్, పైలెట్ పూర్ణచందర్ పాల్గొన్నారు. పరకాల డిపోకు చెందిన బస్సు డ్రైవర్ రంగు కుమారస్వామి.ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది
Post a Comment