శాయంపేట మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుంచి 18 వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించడం ఎంతో అవసరమని తెలిపారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించేది హెల్మెట్ మాత్రమేనని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎస్సై పరమేష్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రహదారి భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని వివరించారు.
అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని స్పష్టం చేస్తూ, అలాంటి ఘటనలు జరిగితే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు భద్రత నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
Post a Comment