మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మార్క్‌ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం తమ మొక్కజొన్న పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు. మధ్యవర్తుల వద్ద పంటను అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.
రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర అందడంతో పాటు మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుందని తెలిపారు. ఇది రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా కీలకమైన అడుగుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post