పులుకుర్తీ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దండు రాజు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జిల్లేళ్ళు మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన నాయకులు అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం, న్యాయం, హక్కుల సాధన కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
Post a Comment