గ్రామ అభివృద్ధి, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పన లక్ష్యంగా కాట్రపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పనులను ఈరోజు గ్రామ సర్పంచ్ వాంకుడోతు సదర్ లాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన మేట్లు ప్రజల సహకారంతో పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా, రాజకీయ పక్షపాతానికి దూరంగా ఉండి ప్రభుత్వం నిర్ణయించిన మెజర్‌మెంట్ల ప్రకారం పనులను సక్రమంగా రికార్డు చేయాలని తెలిపారు.
పనులను నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రజల విశ్వాసం పొందాలని, ప్రభుత్వం కల్పించిన ఈ ఉపాధి అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
Post a Comment