జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా, కాళేశ్వరం:
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు గురువారం కాళేశ్వరం త్రివేణి విశ్రాంతి భవనంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం గర్భాలయం, శుభానంద దేవి అమ్మవారి ఆలయాల పునరుద్ధరణ, పునఃప్రతిష్ట మరియు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ, దేవాదాయ శాఖ ఈఓ మహేష్, దేవాలయ చైర్మన్ మోహన్ శర్మ, సర్పంచ్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 20వ తేదీన ఆలయ పునఃప్రతిష్ట పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో శిలాఫలకం, భూమిపూజ కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కమిషనర్ దేవాదాయ శాఖ ఈఓను ఆదేశించారు.
అనంతరం కమిషనర్ హనుమంతరావు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శుభానంద దేవి, సరస్వతి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి చేపట్టనున్న పనులను ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ వివరించారు
Post a Comment