సమాజమా స్పందించుమా” సాంగ్ ఆవిష్కరణ – అత్యాచారం క్షమించరాని నేరమని అవగాహన

శాయంపేట, ఏప్రిల్ 1:
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన “సమాజమా స్పందించుమా – అత్యాచారం క్షమించరాని నేరం” అనే సామాజిక సందేశాత్మక సాంగ్‌ను శాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావు, సబ్ ఇన్స్పెక్టర్ పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిఐ, ఎస్ఐలు మాట్లాడుతూ రచయిత మొగ్గం సుమన్ సాహిత్యంతో, సింగర్ తుడుం క్రాంతి కుమార్ గాత్రంతో రూపొందిన ఈ పాట సమాజానికి మంచి సందేశం ఇస్తుందని తెలిపారు. మహిళల ప్రాముఖ్యత, వారి విలువను తెలియజేసే ప్రయత్నం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాల్సిన అవసరం ఉందని, మహిళలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు అన్నారు. రచయిత మొగ్గం సుమన్ భవిష్యత్తులో మరిన్ని మంచి పాటలు రాసి సమాజ శ్రేయస్సుకోసం కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగర్ తుడుం క్రాంతి కుమార్ కూడా ఇలాంటి సామాజిక స్పృహ కలిగించే పాటలు పాడుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శాయంపేట మాజీ జడ్పిటిసి వంగాల నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుబాసి కృష్ణమూర్తి, బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారపల్లి క్రాంతికుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అరికిల్ల దేవయ్య, బీఎస్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరపల్లి విజయకుమార్, శాయంపేట మండల అధ్యక్షులు మారపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post