హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని తాహరాపూర్ గ్రామ శివారులో గోకుంట చెరువు కట్ట ప్రాంతంలో నిర్వహిస్తున్న ప్యాకాట శిబిరంపై పోలీసులు దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు గుంపుగా చేరి డబ్బులతో ప్యాకాట ఆడుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టారు.
దాడి సందర్భంగా అక్కడ ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 2,500 నగదు, మూడు మొబైల్ ఫోన్లు మరియు ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న వారిలో కంబాల శివ, తక్కళ్ల సాయికుమార్, బండారి రమేష్, బెడితల రాజ్‌కుమార్, కుక్కల రాజు తదితరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Post a Comment