శాయంపేట చేనేత సహకార సంఘం 64వ వార్షిక మహాసభ నిర్వహణ

శాయంపేట, మార్చి 31 (ప్రతినిధి):
శాయంపేట చేనేత సహకార సంఘంలో 64వ వార్షిక, 81వ అర్ధ వార్షిక సాధారణ మహాసభ బుధవారం నిర్వహించారు. సంఘ పర్సనల్ ఇన్‌చార్జి B సునీత  అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా గత ఆరు నెలల్లో సంఘంలో జరిగిన వ్యాపార లావాదేవీలను నివేదిక రూపంలో సభ్యులకు వివరించారు. సంఘ కార్యకలాపాలు, ఆదాయం-ఖర్చుల వివరాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు.
ఈ మహాసభకు సంబంధిత అధికారులు బొట్టు వెంకటేశ్వర్లు (DMO TSCO), బి. వెంకటేశ్వర్లు (DO H&T) హాజరై సంఘ పనితీరుపై సూచనలు చేశారు. అలాగే మాజీ అధ్యక్షులు బాసని రవి, దిడ్డి రమేష్, మామిడి శంకర్లింగం, పద్మశాలి కుల పెద్దలు, సంఘ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
సంఘ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post