ములుగు జిల్లాలో 99 రోజుల ఆరోగ్య ప్రణాళిక ప్రారంభం“ఈట్ రైట్ వాక్” కార్యక్రమానికి కలెక్టర్ దివాకర్ టి.ఎస్. శ్రీకారం

ములుగు, ఏప్రిల్ 6 (ప్రతినిధి): ములుగు జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల ఆరోగ్య కార్యాచరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ Divakar T. S. సోమవారం ప్రారంభించారు. ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద నిర్వహించిన “Eat Right Walk” కార్యక్రమానికి కలెక్టర్ జెండా ఊపి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని, సరైన ఆహారం, నిత్య వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ 99 రోజుల ప్రణాళిక ద్వారా ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సిహెచ్ మహేందర్ జి, డిఎంహెచ్ఓ గోపాలరావు, డీసీహెచ్ జగదీశ్వర్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, డిపిఓ వెంకయ్య, సిహెచ్‌సి వైద్యాధికారి సురేష్, మున్సిపల్ కమిషనర్ రమేష్, మహిళా సంఘాల సభ్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post