మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిస్తూ సమాన సమాజాన్ని నిర్మించాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన 119వ జయంతి సందర్భంగా శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ, స్వరాజ్యం అనంతరం ఆధునిక భారత నిర్మాణంలోనూ విశిష్ట సేవలు అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందన్నారు.
అత్యల్ప వయసులోనే కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టి పలు సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేశానికి సంఘసంస్కర్తగా, కేంద్రమంత్రిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బాసని రవి, నూర్జగాన్పల్లి సర్పంచ్ రాజీరు, మైలారం ఉప సర్పంచ్ మసికే కుమారస్వామి, మారపల్లి కట్టయ్య, మామిడి సుదర్శన్, కోల శ్రీను, యువజన నాయకుడు కొమ్ముల విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment