శాయంపేట, ఏప్రిల్ 23:
వరకట్నం కేసులో కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు.
వివరాల్లోకి వెళితే... తహరాపూర్ గ్రామానికి చెందిన కొలగాని నవీన్ (21), కూలీ, తన భార్య ఇచ్చిన వరకట్నం కేసులో పరకాల కోర్టుకు పలు మార్లు హాజరు కాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఈ మేరకు శాయంపేట ఎస్సై జే. పరమేశ్వర్ గురువారం (23-04-2026) నిందితుడిని పట్టుకొని పరకాల ప్రిన్సిపల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీ సాయి శరత్ గారి ఎదుట హాజరు పరిచారు. విచారణ అనంతరం నిందితుడిని 14 రోజుల పాటు పరకాల సబ్ జైలుకు రిమాండ్‌కు పంపించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ముగ్గురికి జరిమానా
అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ముగ్గురు వ్యక్తులకు కోర్టు రూ.1500 చొప్పున జరిమానా విధించింది.
ఇంకా బాట విషయంలో గొడవకు దిగిన పత్తిపాక గ్రామానికి చెందిన కత్తి పతుషా, కత్తి ఓదెలు, కత్తి జామునలపై కేసులు నమోదు చేసి, వారు కోర్టులో జరిమానా చెల్లించినట్లు పోలీసులు తెలిపారు.
Post a Comment