అక్రమంగా PDS బియ్యం రవాణా – వ్యక్తి అరెస్ట్

శాయంపేట, మార్చి 19: శాయంపేట పోలీసుల అప్రమత్తతతో అక్రమంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) బియ్యం రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈరోజు ఉదయం సుమారు 8 గంటల సమయంలో శాయంపేట ఎస్సై జె. పరమేశ్వర్  తన సిబ్బందితో కలిసి మైలారం గ్రామ పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న TS24T0105 నెంబర్ గల ట్రక్‌ను ఆపి తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 28 క్వింటాళ్ల PDS బియ్యం బయటపడింది.
ఈ బియ్యాన్ని ఆత్మకూర్ మండలం కామరాం గ్రామానికి చెందిన తక్కళ్లపెల్లి చిరంజీవి (తండ్రి: వీరాస్వామి) అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు బియ్యంతో పాటు ట్రక్‌ను స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post