పాఠశాలల సమీపంలో సిగరెట్ విక్రయాలపై పోలీసుల దాడులు

శాయంపేట, మార్చి 19: శాయంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల పరిసరాల్లో సిగరెట్ ఉత్పత్తుల విక్రయంపై శాయంపేట పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలల నుండి 100 మీటర్ల పరిధిలో సిగరెట్ విక్రయం నిషేధం ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా పత్తిపాక గ్రామంలో ఇద్దరు కిరాణా దుకాణదారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రభుత్వ పాఠశాల సమీపంలో సిగరెట్లు విక్రయిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం అందింది. వెంటనే పోలీసులు పత్తిపాకలోని సుధాకర్ కిరాణం మరియు అన్నపూర్ణ కిరాణా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సిగరెట్ బాక్సులు లభించగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని, సంబంధిత దుకాణదారులపై కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా శాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. రంజిత్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల పరిసరాల్లో 100 మీటర్ల లోపల సిగరెట్ విక్రయం పూర్తిగా నిషేధించబడినదని తెలిపారు. అలాగే పబ్లిక్ ప్రదేశాల్లో ధూమపానం చేయడం, మైనర్లకు సిగరెట్లు అమ్మడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.
నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post