దామెర, మార్చి 19: నిషేధిత ప్రాంతాల్లో సిగరెట్లు మరియు పొగాకు ఉత్పత్తులు విక్రయించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జైలు శిక్షలు కూడా తప్పవని శాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. రంజిత్ రావు హెచ్చరించారు.
Cigarettes and Other Tobacco Products Act (COTPA)-2003 చట్టం ప్రకారం పబ్లిక్ ప్రదేశాల్లో ధూమపానం చేయడం, 18 సంవత్సరాల లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం, అలాగే విద్యాసంస్థల సమీపంలో 100 గజాల పరిధిలో సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులు అమ్మడం పూర్తిగా నిషేధించబడినదని తెలిపారు.
ఇటీవల ఈ చట్టం నిబంధనలను ఉల్లంఘించిన పలువురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
ప్రజలు పొగాకు వినియోగం ఆరోగ్యానికి హానికరమని గుర్తించి, అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని, చట్టాన్ని గౌరవించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గమనించినట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.
Post a Comment