విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు విక్రయాలపై కఠిన చర్యలు: దామెర ఎస్సై కొంక అశోక్


దామెర, మార్చి 19: విద్యాసంస్థల సమీప ప్రాంతాల్లో సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయంపై దామెర పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేశారు.
ఈ రోజు (19-03-2026) దామెర ఎస్సై కొంక అశోక్  తన సిబ్బందితో కలిసి దామెర మండల పరిధిలోని లాదెళ్ల గ్రామం మరియు సింగరాజుపల్లి గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల నుండి 100 గజాల పరిధిలో ఉన్న కిరాణా దుకాణాల్లో సిగరెట్లు మరియు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న నాలుగు షాపుల యజమానులను గుర్తించి, వారి పై Cigarettes and Other Tobacco Products Act (COTPA)-2003 ప్రకారం కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై కొంక అశోక్ మాట్లాడుతూ, పబ్లిక్ ప్రదేశాల్లో ధూమపానం చేయడం, 18 సంవత్సరాల లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం, అలాగే విద్యాసంస్థల సమీపంలో 100 గజాల పరిధిలో సిగరెట్లు విక్రయించడం పూర్తిగా నిషేధించబడినదని తెలిపారు.
COTPA చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post