పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో సేవా రత్న అవార్డు గ్రహీతకు సన్మానం

పరకాల మండలంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘన కార్యక్రమం నిర్వహించబడింది. పద్మశాలి మండల అధ్యక్షులు దాసరి బిక్షపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ఇటీవల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ 18వ సౌత్ ఇండియా కాన్ఫరెన్సులో సేవా రత్న జాతీయ అవార్డు అందుకున్న పద్మశాలి కుల బాంధవుడు మార్త బిక్షపతి ఆత్మీయ సన్మానం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన బిక్షపతి ఈ అవార్డు రావడం గర్వకారణమని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకా ఉన్నత స్థాయి గుర్తింపులు పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస చేనేత సహకార సంఘం అధ్యక్షులు మంత్రి రాజేందర్, పద్మశాలి సేవా సంఘం ట్రస్ట్ బోర్డ్ అధ్యక్షులు డాక్టర్ మంత్రి కాశయ్య, స్థానిక 9వ వార్డ్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారి పాల్గొన్నారు. అలాగే పద్మశాలి కుల బంధువులు బూర వెంకటేశ్వర్లు, పెగడ ధనం, వావిలాల రవీందర్, సంఘ నరేష్, మంతెన సంతోష్, పోరండ్ల రాజేందర్, ఖ్యాతం శివ, దారుణ పరమేశ్వర్, వావిలాల రాజయ్య, మోతె సారంగపాణి, వేముల అశోక్, ఖ్యాతం రమేష్ తదితరులు హాజరయ్యారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post