నల్లబెల్లిలో గంజాయి స్వాధీనంఇద్దరు యువకులు అదుపులోకి

నల్లబెల్లి : నల్లబెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన పెట్రోలింగ్‌లో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సోమవారం (16-03-2026) ఉదయం శనిగరం క్రాస్ రోడ్డు (NH-635) వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద నుంచి సుమారు 951 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు పేరబోయిన అనుర్వేశ్ యాదవ్ (17), రేబల్లె గ్రామం, కక్కెర్ల అభిరామ్ (19), వెంకటాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు ఒడిశా ప్రాంతం నుండి గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
నిందితుల వద్ద ఉన్న గంజాయి తో పాటు రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post