చేనేత పద్మశాలి భవనంలో శ్రీరామ పరపతి సంఘం 17వ మహాసభ

శాయంపేట : తేదీ 15-03-2026న మధ్యాహ్నం 2 గంటలకు శాయంపేటలోని చేనేత పద్మశాలి భవనంలో శ్రీరామ పరపతి సంఘం 17వ మహాసభ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి సంఘం అధ్యక్షులు శ్రీ వనం దేవరాజ్ అధ్యక్షత వహించారు.
సమావేశంలో ముందుగా సంఘానికి సంబంధించిన లెక్కలు సభ్యుల ముందుంచి పరిశీలించగా, సభ్యులందరూ వాటిని ఆమోదించారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా వనం దేవరాజ్, అధ్యక్షులుగా బత్తుల శ్రీధర్, ఉపాధ్యక్షులుగా గొట్టిముక్కుల రాజేష్, ప్రధాన కార్యదర్శిగా గొట్టిముక్కుల చక్రపాణి, కోశాధికారిగా బత్తుల రాజేష్, సహాయ కార్యదర్శిగా దుబాసి రవిలను ఎన్నుకున్నారు.
అలాగే డైరెక్టర్లుగా మామిడి రతన్ కుమార్, గొట్టిముక్కుల రంజిత్, సామల మల్లేశం, కోమటి సురేందర్లను ఎంపిక చేశారు. సలహా కమిటీ సభ్యులుగా బాసని శ్రీనివాస్, మామిడి భరత్ కుమార్, తుమ్మ ప్రభాకర్, పరిమళ కుమారస్వామిలను నియమించారు.
ఈ సందర్భంగా సంఘ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను కూడా అధ్యక్షుల అనుమతితో సభ్యులు చర్చించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
సమావేశంలో సంఘానికి చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post