ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వం ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట: ప్రజల ఆరోగ్య సంరక్షణే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ శిబిరాన్ని స్పెషలిస్ట్ వైద్యులు మరియు RBSK వైద్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన చికిత్స పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా డీఎంహెచ్ఓ డా. అప్పయ్య, మండల మెడికల్ ఆఫీసర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post