ప్రజా ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా హెల్త్ మిషన్ ఎమ్మెల్యే జీఎస్సార్..

BLN తెలుగు దినపత్రిక.:భూపాలపల్లి మున్సిపాలిటీ 
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా హెల్త్ మిషన్ - 100 ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు  గండ్ర సత్యనారాయణ రావు  అన్నారు.శుక్రవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జంగేడు కేజీబీవి హాస్టల్లో జరిగిన హెల్త్ మిషన్ -100 కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ మార్చి 2 నుండి జూన్ 9 వరకు కొనసాగే ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా గర్భిణులు, బాలింతలు,చిన్నారులు, వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలను నేరుగా చేరువేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ఈ మిషన్ మొత్తం నాలుగు దశల్లో అమలవుతుందని, ముఖ్యంగా ఈ 100 రోజుల్లో దాదాపు 42 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు టి డయాగ్నొస్టిక్ ద్వారా సుమారు 30 రకాల వైద్య పరీక్షలను పూర్తిగా నిర్వహించనున్నారనీ తెలిపారు. 
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల విజయవంతానికి పటిష్ట కార్యాచరణ ఎమ్మెల్యే జీఎస్సార్..
అనంతరం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సి.ఆర్ నగర్ బాంబుల గడ్డ కమ్యూనిటీ హాల్లో జరిగిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో  ఎమ్మెల్యే జీఎస్సార్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.ఈరోజు నుండి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ళ వేగవంతమైన పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, ప్రజలకు సమయానుకుల సేవలందించడం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్స్,జిల్లా అడిషనల్ కలెక్టర్  విజయ లక్ష్మీ , మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ , వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్  టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post