BLN తెలుగు దినపత్రిక.శాయంపేట: మండలానికి చెందిన యువకుడు గుండు అఖిలేష్ ఆల్ ఇండియా స్థాయిలో ఐపీఎస్ పరీక్షలో 462వ ర్యాంకు సాధించి ప్రతిభ చాటుకున్నారు. శాయంపేటకు చెందిన గుండు శివకుమార్ – సరస్వతి దంపతుల కుమారుడు అయిన అఖిలేష్ ఈ ఘనత సాధించడం స్థానికులకు గర్వకారణంగా నిలిచింది.
కష్టపడి చదువుతూ లక్ష్యాన్ని సాధించిన అఖిలేష్ విజయంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శాయంపేట ప్రాంతానికి చెందిన యువకుడు ఆల్ ఇండియా స్థాయిలో ఐపీఎస్ ర్యాంకు సాధించడం పుట్టిన ఊరుకు గర్వకారణమని పలువురు అభినందించారు.
ఈ సందర్భంగా గుండు అఖిలేష్‌కు ప్రజాప్రతినిధులు, స్నేహితులు మరియు స్థానికులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Post a Comment